50 లక్షలు జరిమానా వేసుకున్న మంత్రి హరీశ్‌

50 లక్షలు జరిమానా వేసుకున్న మంత్రి హరీశ్‌

02-11-2019

50 లక్షలు జరిమానా వేసుకున్న మంత్రి హరీశ్‌

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు తనకు తాను రూ.50 లక్షల జరిమానాగా విధించుకున్నారు. అదెలా? ఎందుకు? అంటే మహిళలకు మెప్పా రుణాలు, చెత్తబుట్టల పంపిణీ కోసం మధ్యాహ్నం 11:30 గంటలకు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మంత్రి హరీశ్‌ సభ ఖరారైంది. తీరా హరీశ్‌, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో కలిసి సభాస్థలికి చేరుకునే సరికి మధ్యాహ్నం 3:30 అయింది. అప్పటిదాక ఎంతో ఓర్పుగా వేచి చూస్తున్న మహిళలకు హరీశ్‌ క్షమాపణలు చెప్పారు. పరిహారంగా తనకు జరిమానా విధించాలని వారిని కోరారు. దీంతో తమకు మహిళా భవనం కోసం నిధులు మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. మంత్రి సరేనన్నారు. మహిళ భవన నిర్మాణానికి రూ.50 లక్షలను మంజూరు చేయిస్తానని వారికి హామీ ఇచ్చారు. వెంటనే ఈఎస్‌సీ కృష్ణారావుతో ఫోన్లో మాట్లాడి నిధులను మంజూరు చేయించాలని ఆదేశించారు.