ఛలో ట్యాంక్‌బండ్‌లో ఉద్రిక్తత...అరెస్టులు

ఛలో ట్యాంక్‌బండ్‌లో ఉద్రిక్తత...అరెస్టులు

09-11-2019

ఛలో ట్యాంక్‌బండ్‌లో ఉద్రిక్తత...అరెస్టులు

ఆర్టీసీ జేఏసీ ఛలో ట్యాంక్‌బండ్‌ ఇచ్చిన పిలుపుతో ట్యాంక్‌బండ్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బైక్‌పై ట్యాంక్‌బండ్‌కు వచ్చిన ఎంపీ సంజయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డిని గాంధీనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బన్సీలాల్‌పేటలో కాంగ్రెస్‌ నేత వి. హనుమంతరావును అరెస్ట్‌ చేశారు. ముదస్తుగా బీజేపీ నేత లక్ష్మణ్‌ను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డిని అరెస్ట్‌ చేసి లంగర్‌హౌస్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాంను ఇందిరాపార్క్‌ కూడలిలో అరెస్ట్‌ చేశారు. నేతల అరెస్టులతో ట్యాంక్‌బండ్‌ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. బారికేడ్లను దాటి ట్యాంక్‌బండ్‌ వైపు ఆందోళనకారులు దూసుకొస్తున్నారు. లిబర్టీ, సచివాలయం దగ్గర పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. పోలీసులు దాడిలో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దాదాపు 300 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు వార్త.