శ్రీదేవి దేవిరెడ్డికి అరుదైన గౌరవం

శ్రీదేవి దేవిరెడ్డికి అరుదైన గౌరవం

12-11-2019

శ్రీదేవి దేవిరెడ్డికి అరుదైన గౌరవం

వరంగల్‌కు చెందిన శ్రీదేవి దేవిరెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలోని ప్రవాసీ భవన్‌లో జరిగిన జాతీయ ఔత్సాహికవేత్త అవార్డుల కార్యక్రమంలో ఆమెకు ప్రైవేట్‌ సెక్టార్‌ మెంటార్‌ పురస్కారం లభించింది. జాతీయ నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్‌ మహేంద్రనాథ్‌ పాండే ఈ పురస్కారాన్ని అందించారు. తెలంగాణ నుంచి ఈ అవార్డు పొందిన తొలి మహిళ శ్రీదేవి కావడం గమనార్హం. ఎస్‌ఆర్‌ ఇన్నోవేషన్‌ ఎక్స్చేంజీ (వరంగల్‌)కి ఆమె వ్వవస్థాపక సీఈఓగా ఉన్నారు. కేవలం రెండేళ్లలోనే వినూత్న ఎక్‌సిస్టమ్‌ను సృష్టించడంలో విజయం సాధించారు. ఇండో-అమెరికన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, లయన్స్‌ ఇంటర్నేషనల్‌, టై హైదరాబాద్‌ నిర్వహించిన కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. పలు అంకుర సంస్థలకు మెంటార్‌గానూ వ్యవహరించారు. గత 8 ఏళ్లలో 22,000 మందికి పైగా విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. అవార్డు అందుకోవడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.