క్యాన్సర్ బాధితురాలు స్వప్న ని పరామర్శించిన బాలయ్య

క్యాన్సర్ బాధితురాలు స్వప్న ని పరామర్శించిన బాలయ్య

12-11-2019

క్యాన్సర్ బాధితురాలు స్వప్న ని పరామర్శించిన బాలయ్య

అనంతపురంకి చెందిన క్యాన్సర్ బాధితురాలు స్వప్న ని బసవతారకం హాస్పిటల్ లో ఈరోజు స్వయానా బాలయ్య వెళ్లి పరామర్శించి, ఆరోగ్యం గురించి అడిగి తెలుసున్నారు..అలాగే ఉచిత వైద్యం,

ఆపరేషన్ పూర్తిఅయ్యాక కృత్రిమ కాలు కూడా బాలయ్యే అందిస్తున్నారు.. అలాగే DEC 20 విడుదల అవుతున్న రూలర్ సినిమా Stills ని స్వప్న కి చూపించారు. క్యాన్సర్ పేషేంట్ ని చూస్తే దూరంగా ఉండే ఈరోజుల్లో బాలయ్య స్వప్నకి నుడిటిమీద ముద్దు పెట్టి నేనున్నా బంగారుతల్లి నీకు అని ప్రేమగా ఆప్యాయంగా పలకరించారు..

ఇక్కడ హాస్పిటల్ వాళ్ళు నన్ను కంటికి రెప్పలా బాగా చూసుకుంటున్నారు అని.. మీరు చేసిన సాయం ఎన్నటికి మర్చిపోలేమని ,, నేను బ్రతుకుతాను అనే నమ్మకం వచ్చిందని స్వప్న బాలయ్యతో అన్నారు.

బాలయ్య మాట్లాడుతూ ప్రతిభావంతురాలైన పేదింటి అమ్మాయి స్వప్న క్యాన్సర్ తో బాధపడుతూ.. ఆపరేషన్ చేయించుకోలేని పరిస్థితితో ఇంట్లోనే ఉన్నారని తెలుసుకొని నా అభిమానులు నా దృష్టికి తీసుకువచ్చి స్వప్న కి తోడుగా నిలిచేలా చేశారు అన్నారు బాలయ్య.

బాలయ్యతో పాటు CEO #ప్రభాకరరావు, డా.. హరిత, హరికృష్ణ, వైద్య బృందం స్వప్న ని పరామర్శించారు.