ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు కేంద్రం షాక్‌

ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు కేంద్రం షాక్‌

21-11-2019

ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు కేంద్రం షాక్‌

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు కేంద్ర హోంశాఖ పెద్ద షాకిచ్చింది. ఆయన భారత పౌరసత్వానికి అనర్హుడని ప్రకటించింది. రమేష్‌ పౌరసత్వం మీద వివాదం ఉన్న విషయం విదితమే. ఆయన 1993లో జర్మనీకి వలసవెళ్లారు. జర్మనీ పౌరసత్వాన్ని స్వీకరించారు. ఆ తర్వాత 2009లో భారత్‌కు తిరిగి వచ్చారు. మళ్లీ భారత పౌరసత్వాన్ని స్వీకరించారు. మూడుసార్లు టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసిన గెలిచిన చెన్నమనేని రమేష్‌ పౌరసత్వం మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆది శ్రీనివాస్‌ అనే నాయకుడు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆ వివాదం కేంద్ర హోంశాఖ వద్దకు వచ్చింది. దీనిపై 2017 లోనే ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. అయితే, చెన్నమనేని రమేష్‌ దీనిపై రివ్యూ పిటిషన్‌ వేశారు. న్యాయ పోరాటం చేస్తామని చెన్నమనని ప్రకటించారు.