ఈ నెల 11న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

ఈ నెల 11న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

07-12-2019

ఈ నెల 11న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు ప్రగతిభవన్‌లో జరగనుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఇరిగేషన్‌శాఖ సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. దుమ్ముగూడెం వద్ద 37 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పాటు 320 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా ఆనకట్ట నిర్మించాలని సీఎం నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోస్తున్న నేపథ్యంలో.. మొత్తం మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా అదనపు పనులను చేపట్టాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. సీతారామ ప్రాజెక్టు మొత్తం పనులకు రూ.14వేల కోట్లు అవసరమవుతాయని అంచనా. దీనిపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశముంది. కొత్త రెవెన్యూ చట్టంపై కూడా మంత్రివర్గం చర్చించే అవకాశముంది. ఒక వేళ రెవెన్యూ చట్టం సిద్ధమై మంత్రివర్గం ఆమోదం పొందితే ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్‌ కొన్ని హామీలు ఇచ్చారు. వాటిపై చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.