నల్సార్‌లో 3 నుంచి అంతర్జాతీయ న్యాయసంస్థ సమావేశాలు
MarinaSkies
Kizen
APEDB

నల్సార్‌లో 3 నుంచి అంతర్జాతీయ న్యాయసంస్థ సమావేశాలు

01-09-2017

నల్సార్‌లో 3 నుంచి అంతర్జాతీయ న్యాయసంస్థ సమావేశాలు

హైదరాబాద్‌ నగరంలో మరో అంతర్జాతీయ సదస్సు జరగనుంది. సెప్టెంబర్‌ 3 నుంచి 10 వరకు నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ న్యాయ నిపుణుల సదస్సు జరగనుంది. సదస్సును ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారని నల్సార్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ బాలక్రిష్టారెడ్డి, న్యాయ సంస్థ అధ్యక్షులు పిఎస్‌రావు మీడియాకు తెలిపారు. అంతర్జాతీయ న్యాయ సదస్సు ఇండియాలో జరగడం ఇదే మొదటిసారి అన్నారు. మొదటిసారిగా ఇండియాలో జరిగే సదస్సు హైదరాబాద్‌లో జరగడం సంతోషంగా ఉందన్నారు. సదస్సుకు 32 దేశాలకు చెందిన 60 మంది అంతర్జాతీయ న్యాయ శాస్త్ర నిపుణులు పాల్గొంటారని చెప్పారు. వారం రోజులపాటు న్యాయ సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. దేశాల మధ్య నెలకొన్న సమస్యలతోపాటు పేదలకు న్యాయం జరిగే విధానాలపై కూడా చర్చించనున్నట్లు సృష్టం చేశారు.