ఇంటింటికీ నీళ్లూ.. నెట్

ఇంటింటికీ నీళ్లూ.. నెట్

01-09-2017

ఇంటింటికీ నీళ్లూ.. నెట్

రాష్ట్రంలో టి-ఫైబర్‌తో విప్లవాత్మక మార్పులు వస్తాయని, గ్రామాల్లో నిర్ణీత లక్ష్యం ప్రకారం మిషన్ భగీరథ ప్రాజెక్టు పూర్తవుతుందని , మిషన్ భగీరథ పథకానికి టి-ఫైబర్ ప్రాజెక్టు అనుసంధానించి ఇంటింటికి మంచినీళ్లు, ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించబోతున్నట్టు మున్సిపల్, ఐటీ మంత్రి కె తారకరామారావు వెల్లడించారు. టి-ఫైబర్ ప్రాజెక్టు ఫలాలను పట్టణాలు, నగరాలకు సైతం అందిస్తామన్నారు. వాటర్ పైపులైన్‌తోపాటు ఆఫ్టిక్ ఫైబర్ లైన్ వేయాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రతీ మున్సిపాలిటీ, కార్పొరేషన్లతోపాటు వాటర్ వర్క్స్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న పనుల్లో ప్రతి పైపులైన్‌తో పాటు ఇంటర్‌నెట్ లైన్లు వేయాలని, ఈమేరకు ఎంత మేరకు ఖర్చవుతుందో అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో టి-ఫైబర్‌తో విప్లవాత్మక మార్పులు వస్తాయని, గ్రామాల్లో నిర్ణీత లక్ష్యం ప్రకారం మిషన్ భగీరథ ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. ఒకవైపుమంచినీళ్లతో పాటు ఇంటింటికి ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించనుండటంతో మిషన్ భగీరథ అర్బన్ పనులతోపాటు టి-ఫైబర్ పనులనూ వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు.