మార్చిలో యాదాద్రి ప్రధాన ఆలయం పనులు పూర్తి

మార్చిలో యాదాద్రి ప్రధాన ఆలయం పనులు పూర్తి

01-09-2017

మార్చిలో యాదాద్రి ప్రధాన ఆలయం పనులు పూర్తి

మార్చిలో జరిగే బ్రహ్మాత్సవాల నాటికి యాదాద్రి ప్రధాన ఆలయం పనులు పూర్తవుతాయని, మిగిలిన పనులు తరువాత కొనసాగుతాయని యాదాద్రి అభివృద్ధి పనులు పర్యవేక్షిస్తున్న కిషన్‌రావు, ఆలయ ఇవో గీతారెడ్డి తెలిపారు. మూడు దశల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, మొదటి దశలో ప్రధాన ఆలయ పునర్నిర్మాణాన్ని మార్చినాటికి పూర్తి చేయనున్నారు. రెండో దశలో కాటేజీల నిర్మాణం, సుందరీకరణ, టెంపుల్ సిటీ అభివృద్ధి పనులు జరుగుతాయి. ఈ పనులూ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మూడో దశ పనులు త్వరలోనే చేపట్టనున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు దాదాపు 300 కోట్లు వెచ్చించారు. మరో 500 కోట్లతో పనులు జరుగుతున్నాయి.