సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక?

సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక?

02-09-2017

సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక?

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు వీలుగా బండారు దత్తాత్రేయ కేంద్ర కార్మిక శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మంత్రి పదవికి రాజీనామా చేసిన దత్తాత్రేయ ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా పంపే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇది జరిగితే ఆయన ప్రాతినిధ్య వహిస్తున్న సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం కానుంది. ఉప ఎన్నిక నిర్వహిస్తే, బీజేపీ నుంచి సీనియర్‌ నేతలు మురళీధర్‌ రావు, లేదా  కిషన్‌ రెడ్డి బరిలోకి దించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ నుంచి అభ్యర్థిని బరిలోకి దించకపోవచ్చని సమాచారం. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత సికింద్రాబాద్‌ ఉప ఎన్నికపై సృష్టత రానుంది.