జీఈఎస్ సందర్భంగా టీహబ్ పై అందరి దృష్టి

జీఈఎస్ సందర్భంగా టీహబ్ పై అందరి దృష్టి

11-09-2017

జీఈఎస్ సందర్భంగా టీహబ్ పై అందరి దృష్టి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసిన ఆవిష్కరణల కేంద్రం టీహబ్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, దిగ్గజ సంస్థల ఉన్నతాధికారులు ఈ కేంద్రాన్ని సందర్శించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్)ను హైదరాబాద్‌లో వచ్చే నవంబర్ 28 నుంచి 30 వరకు నిర్వహించనున్న నేపథ్యంలో.. అమెరికా సహా వివిధ దేశాల ప్రముఖులు టీహబ్‌ను సందర్శించేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈమేరకు హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ వర్గాలు తగు ఏర్పాట్లు చేస్తున్నాయి.

టీహబ్‌ను సందర్శించిన నీతి ఆయోగ్, అమెరికా కాన్సులేట్ వర్గాలు టీహబ్ నుంచి ప్రాథమికంగా సమాచారం సేకరించారు. నీతిఆయోగ్ సలహాదారు అన్నారాయ్, కాన్సులేట్ వర్గాలు వేర్వేరుగా టీహబ్‌లోని స్టార్టప్‌లతో చర్చించారు. అమెరికా కాన్సులేట్ అధికారులు కూడా టీహబ్‌ను సందర్శించారు.