వందకుపైగా దేశాల నుంచి....

వందకుపైగా దేశాల నుంచి....

11-09-2017

వందకుపైగా దేశాల నుంచి....

హైదరాబాద్‌లో నవంబర్‌ 28 నుంచి 30వ తేదీ వరకు జరిగే గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ సమ్మిట్‌ (జీఈఎస్‌)కు వందకుపైగా దేశాలనుంచి సుమారు మూడువేల మంది హాజరుకానున్నారు. ఇందులో దాదాపు 1500 మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఉంటారని తెలుస్తున్నది. ఎంట్రప్రెన్యూరర్‌లు, ఇన్వెస్టర్‌లు, ఎడ్యుకేషనిస్టులు, ప్రభుత్వ అధికారులు, బిజినెస్‌ రిప్రజెంటెటివ్‌లు ఇందులో పాల్గొంటున్నారు.  సదస్సుకు భారత్‌కు చెందిన 400 మంది, అమెరికా నుంచి 400 మంది, ఇతర దేశాల నుంచి మరో 400 మందితో కలిపి 160 దేశాల నుంచి 1500 మందికిపైగా ప్రతినిధులు హాజరుకానున్నారు.  భారతదేశ ప్రతినిధులను నీతిఅయోగ్‌, విదేశీ వ్యవహారాలశాఖ, వాణిజ్య శాఖ సమన్వయం చేస్తాయి. సదస్సుకు హాజరయ్యే అన్ని దేశాల ప్రతినిధులను అమెరికాయే ఖరారు చేస్తుంది. వారికి అయ్యే ఖర్చులను కూడా భరిస్తుంది.