అక్టోబర్‌ 5 నుంచి హైదరాబాద్‌లో అంతర్జాతీయ టూరిజం సదస్సు
Nela Ticket
Kizen
APEDB

అక్టోబర్‌ 5 నుంచి హైదరాబాద్‌లో అంతర్జాతీయ టూరిజం సదస్సు

12-09-2017

అక్టోబర్‌ 5 నుంచి హైదరాబాద్‌లో అంతర్జాతీయ టూరిజం సదస్సు

అంతర్జాతీయ టూరిజం సదస్సుకు హైదరాబాద్‌ వేదికకానుంది. అక్టోబర్‌ 5 నుంచి 9 వరకు హెచ్‌ఐసిసిలో జరిగే ఈ సదస్సులో ప్రపంచంలోని 85 దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు. 6న జరిగే ప్రారంభ సదస్సును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి, కేంద్ర, రాష్ట్ర టూరిజం శాఖ కార్యదర్శులతో పాటు ఆ శాఖ అధికారులు పాల్గొననున్నారు. నీతి అయోగ్‌ ప్రతినిధి అమితాబ్‌ కాంత్‌, స్కాల్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు విజయ్‌ మోహన్‌ రాజ్‌ హాజరయ్యే ఈ సదస్సులో ఆస్ట్రేలియా, బహమాన్‌, బెల్జియం, బెర్ముడా, బల్గేరియా, కెనడా, చెక్‌ రిపబ్లిక్‌, తదితర 85 దేశాల నుంచి దాదాపు 1000 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హజరు కానున్నారు.