నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పై హైకోర్టు ఆగ్రహం
Nela Ticket
Kizen
APEDB

నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పై హైకోర్టు ఆగ్రహం

12-09-2017

నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పై హైకోర్టు ఆగ్రహం

అవకాశవాద రాజకీయ నాయకులకు చె0ప పెట్టు 

గతంలో గుత్తా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం నియమించిన "ప్రభుత్వ సలహాదారుల" నియామకం మీద హైకోర్టు ను ఆశ్రయించిన గుత్తా. "చట్ట వ్యతిరేఖంగా టిఆర్ఎస్ ప్రభుత్వం సలహాదారులు గా నిమిస్తూ వారికి లక్షల్లో జీతాలు ఇస్తూ ప్రజల సొమ్మును ఇష్టానుసారంగా ఖర్చు పెడుతున్నారు" అంటూ కోర్టును ఆశ్రయించారు. తరువాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లోకి వచ్చిన గుత్తా. కనుక ఈరోజు నేను వేసిన పిటిషన్ ని వాపసు తీసుకుంటున్నట్లు కోర్టుకి తెలిపిన గుత్తా వెంటనే గుత్తా మీద ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం పిటిషన్ వెయ్యడం ,వాపసు తీసుకోవడం అంతా మీ ఇష్టమేనా ? అలాంటప్పుడు పిటిషన్ దాఖలు ఎందుకు చేశారు ? కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు. రాజకీయాలకు కోర్టులను వాడుకుంటున్నారు. మీ వెనక్కు తగ్గిన మేము వెనక్కు తగ్గము పిటిషన్ ఉపసంహరణకు మేము ఒప్పుకోము విచారణ కొనసాగిస్తాము అని తేల్చి చెప్పింది కోర్టు.