మద్యం ప్రియులకు కిక్కే కిక్కు
Nela Ticket
Kizen
APEDB

మద్యం ప్రియులకు కిక్కే కిక్కు

12-09-2017

మద్యం ప్రియులకు కిక్కే కిక్కు

మీరు హైదరాబాదు వెళితే రాత్రి 11 గంటల వరకు వైన్ షాప్స్ లో సరుకు దొరుకుతుంది

హైదరాబాద్‌ నగరంలో ఇక నుంచి మద్యం దుకాణాలను రాత్రి 11 గంటల వరకు తెరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిని అబ్కారీ శాఖ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానించి పర్యవేక్షిస్తారు.

రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ప్రకటించింది. అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి రెండేళ్ల పాటు కొత్త విధానం అమల్లోకి రానుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,216 దుకాణాలకు అనుమతి ఇవ్వనుంది. కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు బుధవారం నుంచే దరఖాస్తులు స్వీకరిస్తారు. దీంతో పాటు ప్రస్తుతమున్న ఆరు శ్లాబులను నాలుగుకు తగ్గించడతో పాటు దరఖాస్తు రుసుమును లక్ష రూపాయలకు పెంచారు. ఈ ఏడాది ఎక్సైజ్‌ ఆదాయం రూ.15వేల కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నట్లు ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్‌కుమార్‌ తెలిపారు.