అన్ని పాఠశాలల్లో తెలుగును బోధించాలి - కేసీఆర్
Nela Ticket
Kizen
APEDB

అన్ని పాఠశాలల్లో తెలుగును బోధించాలి - కేసీఆర్

12-09-2017

అన్ని పాఠశాలల్లో తెలుగును బోధించాలి - కేసీఆర్

వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో తెలుగును కచ్చితంగా బోధించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలిపారు. కాగా ఈ రోజు సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. 12వ తరగతి వరకు పాఠ్యాంశంగా తెలుగును కచ్చితంగా బోధించే పాఠశాలలకే అనుమతి ఇవ్వనున్నామన్నారు. అలాగే ఉర్దూ కోరుకునే విద్యార్థులకు ఉర్దూ ఐచ్చికంగా ఉండాల‌న్నారు.సాహిత్య అకాడమీ రూపొందించిన సిలబస్‌నే అన్ని పాఠశాలల్లో బోధించాలని, ఇష్టం వచ్చినట్లు పుస్తకాలు ముద్రించుకుని బోధించడం కుదరదన్నారు. సాహిత్య అకాడమి రూపొందించిన సిలబస్‌ బోధనలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది సీఎం కేసీఆర్‌ తెలిపారు.