వైభవంగా తెలుగు మహా సభలు

వైభవంగా తెలుగు మహా సభలు

14-10-2017

వైభవంగా తెలుగు మహా సభలు

అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యేడాది డిసెంబర్‌ 15 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ఆదేశాల మేరక కీలక అంశాలపై కోర్‌ కమిటీ పలు నిర్ణయాలపై చర్చించింది. ప్రపంచ తెలుగు మహాసభలకు ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన తెలుగు ప్రముఖులను ఆహ్వానించే అంశంపై జర్చ జరిగింది. ఇతర దేశాధినేతలు ఆహ్వానించడంతోపాటు పలువురు ప్రముఖులను పిలవడం, ముఖాముకి చర్చలు, వేదికలు, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లు, ప్రచురించాల్సిన ప్రచురణలు, సాహిత్య ప్రక్రియలపై సమావేశలో కీలక చర్చ జరిపారు.