తెలగుదేశం వెర్శస్ కాంగ్రేస్ పొత్తులు తెలంగాణా లో

తెలగుదేశం వెర్శస్ కాంగ్రేస్ పొత్తులు తెలంగాణా లో

20-10-2017

తెలగుదేశం వెర్శస్ కాంగ్రేస్ పొత్తులు తెలంగాణా లో

కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి చంద్రబాబు పై తీవ్రంగానే వత్తిడి తెచ్చారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ఢీకొట్టాలంటే కాంగ్రెస్ తో కలవక తప్పదని కూడా రేవంత్ ఇటీవల చంద్రబాబుతో కుండబద్దలు కొట్టేశారు. అయినా చంద్రబాబు దీనిపై స్పందించలేదు. అందుకే రేవంత్ రెడ్డి పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ నేతలపై బాహాటంగా విమర్శలకు దిగారు. గతంలోనే రేవంత్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. తాము అందుకు సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు. ఇందుకు ప్రతిగా మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కూడా స్పందించి తెలుగుదేశం పార్టీని తాము అంటరానిదానిగా చూడటం లేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు తెలియకుండానే రేవంత్ రెడ్డి పొత్తుల విషయంలో ఒక అడుగు ముందుకేశారు. అందుకే చంద్రబాబు రేవంత్ ను నేరుగా హెచ్చరించకుండా మోత్కుపల్లి వంటి నేతలను పొత్తుల విషయమై ఉసిగొల్పారంటున్నారు. మే నెలలో జరిగిన మహానాడులోకూడా ఈ విషయంపై చంద్రబాబుతో చూచాయగా మాట్లాడినా చంద్రబాబు దాట వేశారని రేవంత్ అనుచరులు చెబుతున్నారు.

కాంగ్రెస్ తో పొత్తు ఎలా?

తెలంగాణాలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు అంగీకరించే ఛాన్స్ లేదు. ఆ విషయం రేవంత్ కూ తెలియంది కాదు. ఎందుకంటే రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ తో తెలంగాణలో పొత్తు పెట్టుకుంటే ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ పై ఆ ప్రభావం పడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకనే చంద్రబాబు ఎట్టిపరిస్థితుల్లో కాంగ్రెస్ తో పొత్తుకు అంగీకరించబోరు. అంతేకాకుండా బీజేపీతో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ మిత్రపక్షంగా ఉంటూ తెలంగాణలో కాంగ్రెస్ తో ఎలా పొత్తు పెట్టుకుంటారు? ఈ విషయాలన్నీ రేవంత్ కు తెలిసినవే. కాని చంద్రబాబును ఇరకాటంలో పెట్టి తాను బయటపడటానికే కాంగ్రెస్ తో పొత్తు విషయంపై చంద్రబాబుపై వత్తిడి తెచ్చినట్లు సమాచారం. కాని చంద్రబాబు నేరుగా చెప్పకుండా తెలివిగా టీడీపీ నేతలతో పొత్తు గురించి మాట్లాడించడంతో రేవంత్ ఇక పూర్తిగా బయటపడిపోయారు. చంద్రబాబుకు కేసీఆర్ ముఖ్యం కాదు… జగన్ ను ఎదుర్కొనడమే అతి ముఖ్యమైన విషయం. అందుకే రేవంత్ లాంటి నేతలు పార్టీ వీడినా ఆయన పట్టించుకోరన్నది పార్టీ వర్గాల టాక్. ఇప్పటికే చంద్రబాబు తెలంగాణలో పార్టీని దాదాపు పూర్తిగా వదిలేసినట్లే. రేవంత్ లాంటి వ్యక్తులు వెళ్లినా… ఆయన మరో నేతకు పగ్గాలు అప్పగించి మ..మ అనిపిస్తారు తప్ప పెద్దగా స్పందిచరు. అయితే రేవంత్ ఏపీ మంత్రులపై చేసిన వ్యాఖ్యలు మాత్రం పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

డిసెంబర్ 9 నుంచి పాదయాత్ర…

రేవంత్ రెడ్డి ఇక తెలంగాణ ప్రకటన వచ్చిన డిసెంబర్ 9వ తేదీ నుంచి పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. రాహుల్ గాంధీని కలిసిన తర్వాతనే రేవంత్ ఓపెన్ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పదవి రేవంత్ కు ఇచ్చే అవకాశముంది. తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే కాబట్టి ఆ ప్రకటన వెలువడిన రోజునే పాదయాత్రకు రేవంత్ సిద్ధమయ్యారు. మొత్తం మీద రేవంత్ జాతీయ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయినట్లే. అదికారం కోసం రాజకీయ నాయకులు ఎంతకైనా తెగిస్తారనటానికి ఇదో ఉదాహరణం అంటున్న విమర్శకులు.