హైదరాబాద్‌ లోక్‌సభ బరిలో అజహరుద్దీన్‌?

హైదరాబాద్‌ లోక్‌సభ బరిలో అజహరుద్దీన్‌?

20-10-2017

హైదరాబాద్‌ లోక్‌సభ బరిలో అజహరుద్దీన్‌?

2019 సాధారణ ఎన్నికల్లో  హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇండియా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, మాజీ ఎంపీ అజహరుద్దీన్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగునున్నారు. వచ్చే ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీ అధినేత, ప్రస్థుత ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై కాంగ్రెస్‌ పక్షాన బరిలోకి దిగాలని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతలు సూచించారు.  హైదరాబాద్‌ నగరంలోని చార్మినార్‌ వద్ద సద్బావన అవార్డు అజహరుద్దీన్‌ కు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు పలు సూచనలు చేశారు. హైదరాబాద్‌ లోక్‌ సభ నియోజకవర్గం గురించి హైదరాబాదీ అయిన అజహరుద్దీన్‌ కు అవగాహన ఉందని,  ఇక్కడి ప్రజల సమస్యలు ఆయనకు తెలుసని అందువల్ల వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందని సూచించారు. అజహరుద్దీన్‌ గత 2009 ఎన్నికల్లో మొరాదాబాద్‌ లోక్‌ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించిన విషయం విదితమే. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నాయకుడు జానారెడ్డి, టీకౌన్సిల్‌ పక్ష నేత షబ్బీర్‌ అలీ, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.