ప్రపంచ తెలుగు మహాసభలకు వస్తామంటున్న ఇతర రాష్ట్రవాసులు
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

ప్రపంచ తెలుగు మహాసభలకు వస్తామంటున్న ఇతర రాష్ట్రవాసులు

10-11-2017

ప్రపంచ తెలుగు మహాసభలకు వస్తామంటున్న ఇతర రాష్ట్రవాసులు

ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని వివిధ రాష్ట్రాల్లో తెలుగు మహాసభల సన్నాహక సదస్సులను నిర్వహించారు. ఈ సదస్సులకు విశేష స్పందన వస్తోంది.  ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులో జరిగిన సన్నాహక సదస్సుల్లో పాల్గొన్న అక్కడి తెలుగువారు.. కోర్ కమిటీ సభ్యులతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దృఢసంకల్పాన్ని ప్రశంసించారు. తెలుగుభాష గొప్పదనాన్ని చాటిచెప్పేందుకు ఆయన చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. ప్రత్యేక బస్సులు, రైళ్లలో డిసెంబర్ రెండోవారంలోనే హైదరాబాద్‌కు చేరుకుంటామని ఉత్సాహాన్ని కనబరిచారు. మహాసభల కోసం సేవాదృక్పథంతో వాలంటీర్లుగా పనిచేస్తామని ముందుకొచ్చారు.