ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లకు కమిటీలు

ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లకు కమిటీలు

11-11-2017

ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లకు కమిటీలు

ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లకు ఆరు కమిటీలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ కమిషనర్‌ అధ్యక్షతన ఆహ్వాన కమిటీ, పర్యాటక సంస్థ ఎండీ అధ్యక్షతన వసతులు, పౌరసరఫరాల కమిషనర్‌ అధ్యక్షతన భోజన కమిటీ, రవాణాశాఖ కమిషనర్‌ అధ్యక్షతన రవాణా కమిటీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ అధ్యక్షతన వేదిక, ఆరోగ్య కమిటీ, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అధ్యక్షతన భద్రత కమిటీలను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.