తెలంగాణలో ఒంటరిగానే పోటీ

తెలంగాణలో ఒంటరిగానే పోటీ

12-11-2017

తెలంగాణలో ఒంటరిగానే పోటీ

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఒంటిరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు సృష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొందరు నేతలు సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారినా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారన్నారు. తెలంగాణలో టీడీపీ బలంగా ఉందని అన్నారు. పత్తి, వరి రైతుల సమస్యలపై ఈ నెల 20న నల్గొండ కలెక్టరేట్‌ ముందు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.