2018 నుంచి కొత్త చరిత్ర సృష్టిస్తాం

2018 నుంచి కొత్త చరిత్ర సృష్టిస్తాం

13-11-2017

2018 నుంచి కొత్త చరిత్ర సృష్టిస్తాం

రాష్ట్రంలో 2018, జనవరి 1 నుంచి కొత్త చరిత్ర సృష్టించబోతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. రైతులతో సహా ప్రతి ఒక్కరికి 24 గంటల కరెంట్‌ సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. 24 గంటల విద్యుత్‌తో రాష్ట్ర ముఖచిత్రం మారబోతుందన్నారు. ఏ పథకం తీసుకున్న వందశాతం పారదర్శకంగా అమలు చేస్తున్నామని తేల్చిచెప్పారు. వివక్ష లేని ప్రభుత్వం తమది అని ముఖ్యమంత్రి సృష్టం చేశారు. శాసనసభలో రైతు సమన్వయ సమితులు, రైతులకు పెట్టుబడిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.