ఈ నెల 28న మెట్రో ప్రారంభం
Ramakrishna

ఈ నెల 28న మెట్రో ప్రారంభం

13-11-2017

ఈ నెల 28న మెట్రో ప్రారంభం

హైదరాబాద్‌ నగరవాసులకు మెట్రో ప్రయాణ అనుభూతులను అందించేందుకు సర్వం సిద్ధమవుతున్నది. ఈ నెల 28న మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉందన్నారు. ఇప్పటికే మెట్రో ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం మోదీని ఆహ్వానించిందని గుర్తు చేశారు. దేశ చరిత్రలో మొదటిసారిగా 30 కిలోమీటర్ల మేర మెట్రోను ప్రారంభిస్తున్నామన్నారని అన్నారు. నగరంలో మెట్రో రైలు నిర్వహణ కోసం రూ.3వేల కోట్లు కేటాయించామని తెలిపారు. ఇప్పటి వరకు రూ.2.240 కోట్లు ఖర్చు చేశామన్నారు. కేంద్రం రూ.1,458 కోట్లు సమకూరుస్తుందన్న మంత్రి రూ.958 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. మొదటి దశ 30 కిలోమీటర్ల మెట్రోను ఈ నెలాఖరులో ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టు హైదరాబాద్‌ మెట్రో అని తెలిపారు. మెట్రోను పూర్తిస్థాయిలో నడిపించేందుకు 57 రైళ్లు అవసరమన్నారు. అన్ని రైళ్లు కూడా వచ్చాయన్నారు. అన్ని రకాలుగా, అన్ని హంగులతో ప్రారంభానికి మెట్రో సిద్ధమైందన్నారు.