ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రచన పోటీలు
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రచన పోటీలు

14-11-2017

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రచన పోటీలు

సాహిత్య పరిశోధనలో ప్రామాణికతను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా పరిశోధనా పత్రాల రచనలో పోటీ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్‌ నందిని సిధారెడ్డి అన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ భాష, సాహిత్యం, సంస్కృతి ప్రాతిపదికగా వ్యాసాలు ఉండాలనీ, 10-20 పేజీల నిడివి గలిగిన పరిశోధనా వ్యాసాలు నవంబర్‌ 30లోగా కార్యదర్శి, సాహిత్య అకాడమీ పేరిట పంపించాలన్నారు.

1) తెలంగాణ భాష, సాహిత్యం సంస్కృతిని ప్రాతిపదికగా వ్యాసాలు ఉండాలి.
2) 10-20 పేజీల నిడివి గలిగిన పరిశోధనా వ్యాసాలు నవంబర్ 30 వ తేదీ లోగా కార్యదర్శి, సాహిత్య అకాడమీ, కళాభవన్, రవీంద్రభారతి, సైఫాబాద్, హైదరాబాద్ – 500004 చిరునామాకు పంపించవలెను.
3) పోటీలో గెలుపొందిన ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల వ్యాసరచయితలకు వరుసగా రు.10,000లు, రు.8,000లు, రు.5,000లు మరియు పది వ్యాసాలకు ప్రోత్సాహక బహుమతుల క్రింద ఒక్కొక్కరికి రు.3,000లు బహుమతి ప్రపంచ తెలుగు మహాసభల వేదిక నుండి అందజేయబడుతుంది.
4) పరిశోధనా పత్రం వెంట తమ స్వంత వ్యాసమని అముద్రితమని హామీ పత్రం జత చేయాలి.
5) ఎంపిక చేసిన వ్యాసాలతో తెలంగాణ సాహిత్య అకాడమీ పుస్తకంగా ప్రచురిస్తుంది. బహుమతి ఎంపికలో న్యాయ నిర్ణేతదే తుది నిర్ణయం.