నాలుగేళ్లు ఉంటేనే గ్రీన్‌ కార్డు... 24 ఏళ్లకు నాన్‌ లోకల్‌ ఎలా అవుతా

నాలుగేళ్లు ఉంటేనే గ్రీన్‌ కార్డు... 24 ఏళ్లకు నాన్‌ లోకల్‌ ఎలా అవుతా

14-11-2017

నాలుగేళ్లు ఉంటేనే గ్రీన్‌ కార్డు... 24 ఏళ్లకు నాన్‌ లోకల్‌ ఎలా అవుతా

ఆందోల్‌ నియోజకవర్గంలో 24 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. అమెరికాలో నాలుగేళ్లు ఉంటేనే గ్రీన్‌ కార్డు ఇస్తారు. అలాంటిది 24 ఏళ్ల నుంచి ఉంటున్నప్పుడు నేను నాన్‌ లోకల్‌ ఎలా అవుతా అంటూ సినీ నటుడు, ఆందోల్‌ ఎమ్మెల్యే బాబూమోమన్‌ అన్నారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆందోల్‌లో నేను నాక్‌ లోకల్‌ అంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారని, ఇది సరికాదంటై పై విధంగా వ్యాఖ్యానించారు. అలాగే గత ఎన్నికల్లో సోనియా గాంధీ ప్రచారం చేసిన ఊరిలోనే 80 శాతం ఓట్లు సాధించానని ఆయన పేర్కొన్నారు. నా నియోజకవర్గం మొత్తం సింగూరు జలాలు అందిస్తున్నా, ఈ జలాలతో 40 వేల ఎకరాలకు నీరు ఇస్తున్నారు. మరో ఎనిమిది మండలాల్లో పది వేల ఎకరాలకు నీరు ఇచ్చే పనులు జరుగుతున్నాయని అన్నారు.