తెలుగు ప్రముఖులందరినీ ఆహ్వానించాలి

తెలుగు ప్రముఖులందరినీ ఆహ్వానించాలి

15-11-2017

తెలుగు ప్రముఖులందరినీ ఆహ్వానించాలి

ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాల్లో తెలుగు సంఘాలున్నాయని, దేశంలోని చాలా రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే ప్రజలతోపాటు వారి సంఘాలున్నాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. దేశ విదేశాల్లో పరిపాలన, రాజకీయాలతో పాటు చాలారంగాల్లో ఉన్నతస్థితికి చేరుకున్న తెలుగువారున్నారని, వారందరినీ తెలంగాణలో జరిగే మహాసభలకు ఆహ్వానించాలని చెప్పారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై బుధవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి సమీక్షించారు.  తెలంగాణ ప్రభుత్వం తరఫున వారిని ప్రత్యేకంగా ఆహ్వానించాలి. అమెరికా సహా తెలుగువారు ఎక్కువగా ఉన్న దేశాల్లో, ఆంధ్రప్రదేశ్‌తో సహా తెలుగువారున్న రాష్ట్రాలలో సన్నాహక సమావేశాలు నిర్వహించాలి అని ముఖ్యమంత్రి సూచించారు.