మహాసభల సందర్భంగా విస్తృత ఏర్పాట్లు

మహాసభల సందర్భంగా విస్తృత ఏర్పాట్లు

15-11-2017

మహాసభల సందర్భంగా విస్తృత ఏర్పాట్లు

మహాసభల సందర్భంగా హైదరాబాద్ నగరంలో విస్తృత ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. స్వాగత తోరణాలు నెలకొల్పాలి. తెలుగు భాషలో పద్యాలు, పాటలు, వివిధ ప్రక్రియలకు సంబంధించిన ఆడియోలు ప్రతి చోట వినిపించాలి. ప్రతి ప్రక్రియ ప్రదర్శనకు వేర్వేరు వేదికలు ఏర్పాటుచేయాలి. ఎక్కడ ఏం జరుగుతున్నదో అందరికీ తెలియడానికి విస్తృత ప్రచారం కల్పించాలి. ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్లు, బస్‌స్టేషన్లలో రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేయాలి. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులకు బస, రవాణా, భోజన సదుపాయాలు కల్పించాలి. సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వశాఖలు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి పూర్తి సమన్వయంతో పనిచేయాలి.

పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న భాషా పండితులను ఆన్‌డ్యూటీ మీద సభలకు ఆహ్వానించి, బాధ్యతలు అప్పగించాలి అని సీఎం చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శి ఎస్ నర్సింగ్‌రావు, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి సత్యనారాయణ, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.