నవలా సాహిత్యంపై మహాసభల్లో సమగ్ర పరిశీలన

నవలా సాహిత్యంపై మహాసభల్లో సమగ్ర పరిశీలన

17-11-2017

నవలా సాహిత్యంపై మహాసభల్లో సమగ్ర పరిశీలన

ప్రపంచ తెలుగు మహాసభల్లో మరుగునపడిన తెలంగాణ సాహిత్యానికి  అగ్రతాంబూలం ఇవ్వనున్నారు. తెలంగాణ సాహిత్యంలోని విశిష్టతలను పరిశోధకులకు అందించే బృహత్కార్యాన్ని రాష్ట్ర సాహిత్య అకాడమీ చేపట్టింది. మరుగునపడ్డ కవులను తెలంగాణ ఉద్యమ చైతన్యం వెలుగులోకి తీసుకొస్తే, ఆ కవుల సాహిత్యాన్ని ప్రపంచ తెలుగు మహాసభలు వెలుగులోకి తెస్తున్నాయి. తెలంగాణలో నవలా సాహిత్యాన్ని విశ్లేషిస్తూ తెలంగాణ నవలా సాహిత్యం పేరుతో ఓ సమగ్రపరిశీలనను సాహితీ ప్రియులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తొలితరం నుంచి ఈతరం రచయితల నవలల వరకు ఇందులో ఉంటాయి. తడకమళ్ల కృష్ణారావు రచించిన కంబు కందర చరిత్ర నుంచి పెద్దింటి అశోక్‌కుమార్ రచించిన జిగిరి నవల వరకు రచయిత. నవలాసాహిత్యంతోపాటు తెలుగు సినిమా రంగానికి తెలంగాణ కవుల గేయకవిత్వాన్ని విశ్లేషిస్తూ కందికొండ రాసిన పుస్తకాన్ని ఈ మహాసభల సందర్భంగా ప్రచురిస్తున్నారు. తెలంగాణలో తొలితరం భాషోద్యమకారుల్లో ముఖ్యుడైన మాదిరాజు కోటేశ్వరరావు స్వీయచరిత్రను వెలుగులోకి తెస్తున్నారు. 70 మంది కథకులు రాసిన 70 కథలతో తెలంగాణ కథాసప్తశతిని ప్రచురిస్తున్నారు.