మహాసభల్లో తెలుగు సాహిత్య ప్రక్రియలన్నింటిపైనా చర్చలు

మహాసభల్లో తెలుగు సాహిత్య ప్రక్రియలన్నింటిపైనా చర్చలు

17-11-2017

మహాసభల్లో  తెలుగు సాహిత్య ప్రక్రియలన్నింటిపైనా చర్చలు

తెలంగాణ నుంచి వెలువడిన తెలుగు సాహిత్య ప్రక్రియలన్నింటిపైనా కూలంకషంగా చర్చించి, ఈ మహాసభలు భవిష్యత్ కర్తవ్యాలను నిర్దేశిస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేకతను చాటేలా ప్రభుత్వం అతిథి మర్యాదలు చేస్తుందని, ప్రతినిధులకు వసతి, భోజనం రవాణా సదుపాయాలు కల్పిస్తుందని వివరించారు. మహాసభల ప్రారంభ, ముగింపు వేడుకల్లో జాతీయస్థాయి ప్రముఖులు పాల్గొంటారని సీఎం చెప్పారు. తెలంగాణ సాహితీక్షేత్రాన్ని సుసంపన్నంచేసిన మహాకవుల పేరున తోరణాలు, ద్వారాలు, హోర్డింగులు హైదరాబాద్ నగరం నిండా ఏర్పాటుచేయబోతున్నట్టు తెలిపారు. తెలంగాణ సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నం చేసిన కవుల పేర్లను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. క్రీస్తుశకం ఒకటవ శతాబ్దానికి చెందిన హాలుని గాథా సప్తశతిలో తెలుగుకు సంబంధించిన మౌలిక పద ప్రయోగాలు కనిపిస్తున్నాయి. క్రీ.శ. 947 నాటికే తెలంగాణలో ఛందోబద్ధ సాహిత్యం ఉన్నదని చరిత్ర చాటి చెప్తున్నది. ఎలుగెత్తి పాడుకునే ద్విపద వంటి దేశీయ ఛందస్సులకు తెలంగాణనే జన్మభూమి. తెలుగులో అనేక సాహిత్య ప్రక్రియలకు తెలంగాణనే ఆదిగా నిలిచింది.