కెనడా లో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సు
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

కెనడా లో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సు

18-11-2017

కెనడా లో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సు

టొరంటో కెనడా లో నేడు జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సభ సాయంత్రం 7:౩౦ గంటలకు పల్లీ బ్యాంకేట్ హాలులో అనేక తెలుగు భాషా ప్రియుల మధ్య ఉత్సాహంగా జరిగింది. ముఖ్య అతిధిగా ఎన్నారై కన్వీనర్ శ్రీ మహేష్ బిగాల గారు తెలంగాణ ప్రభుత్వం తరుపున ఆహ్వానాన్ని అందించారు. 

ముందుగా ముడుపు విజయలక్ష్మి గారు స్వాగతం పలుకగా సాయి కిరణ్, సాయి కృష్ణ తెలంగాణ రాష్ట్రీయ గీతం అందెశ్రీ రాసినది ప్రార్థనా గీతంగా పడగా. ఆ సుస్వర సంగీతం చెవులకింపుగా చెవులురే వంటకం అన్నట్లు వహ్వా వచ్చావా అనిపించేటట్లు ఉండెను. 

తెలుగు భాష పంచదార కన్నా, పాయసం కన్నా, చెరుకు రసం కన్నా, జును కన్నా తీయని ఉందని విజయ లక్ష్మి గారు అన్నారు.  

శ్రీ మహేష్ బిగాల గారు తెలుగు భాషా వికాసానికి ప్రపంచానికి భాషా పరిరక్షణకై పాలుపంచుకొమ్మని ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయవలిసింది గా కోరారు. 

TCAGT డైరెక్టర్, ఎంట్రప్రనర్ శ్రీ బెజవాడ సూర్య గారు తెలంగాణ ప్రభుత్వం చేబట్టిన సత్సంకల్పాన్ని ప్రశంసించారు. 

మాతృ భాషా పిల్లలకు దేర్యాన్ని, ఆత్మా గౌరవాన్ని పెంపొదిస్తుందని సత్యం మనబడి విద్యార్థుల ద్వారా స్పష్టం అవుతుంది అని గురునాథ్ దాసు అన్నారు. ఉర్దూ భాషను పాఠశాలల్లో రెండవ భాషా గా విద్యార్థులు నేర్చుకునేటట్లు చేసిన కెసిఆర్ గారికి రుణపడి ఉంటామని టీడీఫ్ జాయింట్ సెక్రటరీ శ్రీ అర్షద్ గోవి గారు అన్నారు. ఈ సభ యావతకు స్ఫూర్తి దాయకంగా ఉంటుంది అని తమవంతు కృషి చేస్తామని అన్నారు. 

సభకు విచ్చేసిన ప్రముఖులు తెలంగాణ సాహితి వేత్త కవి వచన వాగేయ కారుడిగా తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన శ్రీ ముడుపుకుల శేఖర రావు గారిని శ్రీ మహేష్ బిగాల సాదరంగా ఆహ్వానించినారు. పసందైన పాటలతో, విందు భోజనం తో వందన సమర్పణతో సభ ముగిసింది.