ప్రపంచ పారిశ్రామికవేత్తలకు చేనేతతో స్వాగతం

ప్రపంచ పారిశ్రామికవేత్తలకు చేనేతతో స్వాగతం

20-11-2017

ప్రపంచ పారిశ్రామికవేత్తలకు చేనేతతో స్వాగతం

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో తెలంగాణ చేనేత చీరెలు ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతున్నాయి. ఈ సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు రాష్ట్రంలో తయారైన చేనేత చీరెలు ధరించిన మహిళా వాలంటీర్లు స్వాగతం పలుకనున్నారు. ఇందుకు అవసరమైన చూడముచ్చటైన చేనేత చీరెలను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయించింది. పోచంపల్లిలో 200 చీరెలు, సిద్దిపేటలో 200 చీరెలు తయారు చేయించటం విశేషం. సిద్దిపేటలో తయారుచేసిన చీరెలను గొల్లభామ డిజైన్లతో రూపొందించారు. రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నిథిమ్‌, నిప్ట్‌, ఐఐహెచ్‌ఎం విద్యా సంస్థలకు చెందిన 350 మంది విద్యార్థులు వాలంటీర్లుగా సేవలందించనున్నారు. 150 దేశాలకు చెందిన 1,500 మంది ప్రతినిధులకు స్వాగతం పలుకటంతో పాటు సమాచారం అందించటం, సమన్వయం చేయటం లాంటి బాధ్యతలు వాలంటీర్లకు అప్పగించారు. వీరికి శిక్షణ కూడా పూర్తయ్యింది. వాలంటీర్లు చేనేత వస్త్రాలు ధరించటం వల్ల రాష్ట్ర చేనేత కార్మికుల ప్రతిభ ప్రపంచానికి మరోసారి పరిచయమవుతుందన్నఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తున్నది.