ప్రపంచ తెలుగు మహాసభల్లో అన్ని కళలకు తగు ప్రాధాన్యత - సీఎం
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

ప్రపంచ తెలుగు మహాసభల్లో అన్ని కళలకు తగు ప్రాధాన్యత - సీఎం

20-11-2017

ప్రపంచ తెలుగు మహాసభల్లో అన్ని కళలకు తగు ప్రాధాన్యత - సీఎం

అన్ని సాహిత్య ప్రక్రియలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, కళలకు కూడా తగు ప్రాధాన్యత ఉండేలా తెలంగాణ స్వాభిమానాన్ని ఘనంగా చాటేలా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని సీఎం కె చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. . తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రతిభావంతులు తెలంగాణలో ఉన్నారని, ప్రతిభా పాటవాలకు కొదవలేదన్నారు. కానీ తెలంగాణ వారి ప్రతిభకు రావాల్సినంతగా గుర్తింపు లభించలేదన్నారు. భాషాభివృద్థి కోసం ఇక్కడ జరిగిన కృషి వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ సాహిత్య చరిత్రను ప్రపంచానికి చాటాలని, ఎవరినో నిందించడానికి కాకుండా తెలంగాణ స్వాభిమానాన్ని ప్రపంచానికి చాటుదామని సూచించారు. మహాసభల సందర్భంగా అముద్రిత గ్రంథాలను ముద్రించాలని ఆదేశించారు. మహాసభలు అత్యంత కోలాహలంగా అత్యంత అట్టహాసంగా జరగాలన్నారు. స్వాగత తోరణాలతో నగరాన్ని ముస్తాబు చేయాలని, తెలుగు పద్యాలు, సాహిత్యాన్ని వినిపించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

భాగ్యనగరం బాసిల్లేలా నిర్వహించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ వరకు తెలుగు సబ్జెక్ట్‌ను కచ్చితంగా బోధించాలనే నిబంధనను పెట్టడం పట్ల సర్వత్రా ఆమోదం లభించిందన్నారు. ఉర్దూ మీడియం స్కూళ్లలో కూడా ఈ విధానం అమలు చేయాలని ముస్లిం మత పెద్దలు కోరినట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. తెలుగు భాషను అభ్యసించిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే విధానాన్ని అమలు చేద్దామన్నారు. అమ్మను కాపాడుకున్నట్టే తెలుగును కాపాడుకోవాలన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై సోమవారం ప్రగతి భవన్‌లో ప్రముఖ సాహితీవేత్తలతో పాటు ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, ఎంపి కవిత, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీ్ధర్, సాంస్కృతికశాఖ కార్యదర్శి బి వెంకటేశం, డైరెక్టర్ మామిడి హరికృష్ణ, తెలుగు వర్శిటీ వైస్ చాన్స్‌లర్ ఎస్వీ సత్యనారాయణ తదితరులతో సీఎం విస్తృత సమావేశం నిర్వహించారు.