వెస్ట్‌ఇన్‌ హోటల్‌లో ఇవాంక బస

వెస్ట్‌ఇన్‌ హోటల్‌లో ఇవాంక బస

21-11-2017

వెస్ట్‌ఇన్‌ హోటల్‌లో ఇవాంక బస

ఈ నెల 28 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంక హైదరాబాద్‌లో రెండ్రోజులపాటు ఉండనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆమె పర్యటన వివరాలను అధికారికంగా వెల్లడించడం లేదు. మాదాపూర్‌ లోని రహేజా ఐటీ పార్కులోని వెస్ట్‌ఇన్‌ హోటల్‌ ఆమెకు బస ఏర్పాటు చేశారు. ఆమెరికా అధికారులు హోటల్‌ను ఇప్పటికే పరిశీలించి, భద్రత, వసతులపరంగా సంతృప్తి వ్యక్తం చేశారు. సదస్సు జరిగే హెచ్‌ఐసీసీకి వెస్ట్‌ఇన్‌ హోటల్‌ మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో సదస్సుకు హాజరుకావడానికి అనువుగా ఉంటుందని దీనికి ఇవాంక బస కోసం ఎంపిక చేసినట్టు తెలుస్తున్నది.