అమెరికా టు బేగంపేట?

అమెరికా టు బేగంపేట?

22-11-2017

అమెరికా టు బేగంపేట?

ఇవాంకా ట్రంప్‌ అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ఈ నెల 28న బేగంపేట విమానాశ్రయానికి వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధాని మోదీ బేగంపేట, ఇవాంక శంషాబాద్‌ విమానాశ్రయాలకు చేరుకొని అక్కడి నుంచి గ్లోబల్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ (జీఈఎస్‌)కు వస్తారని తొలుత షెడ్యూలు ఖరారైంది. కానీ, తాజాగా ఐబీ హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోదీ, ఇవాంక ఒకే విమానాశ్రయం నుంచి వస్తే భద్రత పరంగా కొంత అనుకూలంగా ఉంటుందని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. ఇవాంక భద్రతను అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ చూస్తున్నప్పటికీ ఇక్కడి నుంచి మహిళా ఐపీఎస్‌ అధికారి కూడా భద్రతా విధుల్లో పాల్గొననున్నట్లు తెలిసింది. కాగా, సమ్మిట్‌ ఏర్పాట్లకు సంబంధించి ఆయా విభాగాల అధికారులు హోటల్‌ వెస్టిన్‌లో సమావేశమయ్యారు. ప్రముఖుల రాకపోకలు సాగించే మార్గాలు, ట్రాఫిక్‌ మళ్లింపు తదితర విషయాలపై ఇంటెలిజెన్స్‌ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు.