ఇవాంక కోసం ప్రత్యేక గాజులు!

ఇవాంక కోసం ప్రత్యేక గాజులు!

23-11-2017

ఇవాంక కోసం ప్రత్యేక గాజులు!

హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే విందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంక హాజరవుతున్న విషయం విదితమే. చారిత్రక చార్మినార్‌ సమీపంలోని లాడ్‌బజార్‌ను సందర్శించి గాజులు కొనుగోలు చేయనున్నారన్న వార్తల నేపథ్యంలో, స్థానిక వ్యాపారులు సరికొత్త ఆకృతుల్లో గాజులను తయారు చేసి ప్రస్తుతం అందుబాటులో ఉంచారు. ఇవాంకా ట్రంప్‌ తమ దుకాణానికి వస్తే, తాము ప్రత్యేకంగా తయారుచేయించిన ఈ గాజులను ఆమెకు బహూకరిస్తానని ఓ దుకాణం యజమాని అన్వర్‌ చెప్పాడు.