జీఈఎస్‌ అతిథులకు అమెరికా తేనేటి విందు

జీఈఎస్‌ అతిథులకు అమెరికా తేనేటి విందు

23-11-2017

జీఈఎస్‌ అతిథులకు అమెరికా తేనేటి విందు

ప్రపంచ పెట్టుబడిదారుల శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్‌)కు వచ్చే అతిథులకు అమెరికా ప్రభుత్వం తరపున స్థానిక యూఎస్‌ కాన్సులేట్‌ అధికారులు తేనేటి విదు ఇవ్వనున్నారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం నోవాటెల్‌లో విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా అమెరికా నుంచి ప్రజెంటేషన్‌ కూడా ఉండనుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సదస్సుకు హాజరయ్యే అతిథులకు ఈ నెల 28న చారిత్రాత్మక ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, 29న రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్‌ గోల్కొండ కోటలో విందు ఇవ్వనున్న విషయం తెలిసిందే.