చార్మినార్‌ వద్ద ఇవాంక షాపింగ్‌!

చార్మినార్‌ వద్ద ఇవాంక షాపింగ్‌!

23-11-2017

చార్మినార్‌ వద్ద ఇవాంక షాపింగ్‌!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూతురు ఇవాంక ట్రంప్‌ హైదరాబాద్‌లో సైట్‌ సీయింగ్‌కు వెళ్లనున్నారు. ఫలక్‌నామా ప్యాలెస్‌లో డిన్నర్‌తో పాటు ఆమె ఓల్డ్‌ సిటీలో టూర్‌ చేసే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వస్తున్న ఇవాంక చార్మినార్‌ను సందర్శించనున్నారు. 1591లో మొహమ్మద్‌ ఖులీ కుతుబ్‌ షా చార్మినార్‌ను కట్టించారు. హైదరాబాద్‌కు వచ్చిన పర్యాటకులు చార్మినార్‌ను చూడకుంటే టూర్‌ పూర్తి కానట్టే. అయితే ఇవాంకా తన హైదరాబాద్‌ ట్రిప్‌లో భాగంగా ఓల్డ్‌ సిటీలోని లాడ్‌బజార్‌లోనూ షాపింగ్‌ చేయనున్నట్లు తెలుస్తున్నది. బ్యాంగిల్స్‌, బ్రైడల్‌ వియర్‌కు ఫేమస్‌ అయిన లాడ్‌బజార్‌లో ఆమె షాపింగ్‌ చేస్తుందని అంచనా వేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఇవాంక షెడ్యూల్‌ పూర్తిగా వెల్లడికాలేదు. చార్మినార్‌ దగ్గరే ఉన్న మక్కా మసీదుతో పాటు చౌమహల్లా ప్యాలెస్‌లను కూడా ఇవాంకా విజిట్‌ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది.