ప్యానెల్ డిస్కషన్లో ఇవాంక, కేటీఆర్

ప్యానెల్ డిస్కషన్లో ఇవాంక, కేటీఆర్

25-11-2017

ప్యానెల్ డిస్కషన్లో ఇవాంక, కేటీఆర్

 ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌)లో రెండోరోజు (29)న నిర్వహించే ప్యానెల్‌ డిస్కషన్‌లో ఇవాంక ట్రంప్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు పాల్గొంటారు. ఆవిష్కరణల రంగంలో రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. టీహబ్‌, టాస్క్‌, రిచ్‌ లాంటి వినూత్న కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నది. టీహబ్‌ మొదటిదశకు భారీ డిమాండ్‌ రావడంతో రెండో దశ టీహబ్‌ను దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా నిర్మించడానికి ఇప్పటికే పనులు చేపడుతున్నారు. టాస్క్‌ ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడానికి శిక్షణ ఇస్తున్నారు. పరిశ్రమలు, మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దుతున్నారు. ఈ అంశాలపై చర్చించడంతోపాటు మహిళలను పారిశ్రామికరంగంలో ఉన్నవారికి ఏ విధంగా సహాయం చేయాలన్న విషయాలు ప్యానెల్‌ డిస్కషన్‌లో చర్చకు వచ్చే అవకాశమున్నది. ఇన్నోవేషన్‌లో భవిష్యత్‌ ఆలోచనలను మంత్రి కేటీఆర్‌ వివరించే అవకాశముంది.