నృత్య కళాకారుడికి అరుదైన అవకాశం

నృత్య కళాకారుడికి అరుదైన అవకాశం

25-11-2017

నృత్య కళాకారుడికి అరుదైన అవకాశం

అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ఎదుట నృత్యాన్ని ప్రదర్శించే అరుదైన అవకాశాన్ని ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన నృత్య కళాకారుడు షేక్‌జానీమియా దక్కించుకున్నారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు సందర్భంగా 29న గోల్కోండ కోటను  సందర్శించనున్న ఇవాంక ఎదుట జానీమియా తన బృందంతో భక్త రామదాసు కీర్తనపై నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ నృత్యానికి జానీమియా గురువైన డాక్టర్‌ ఆనందశంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తల్లాడకు చెందిన లారీడ్రైవర్‌ షేక్‌సైదా-సాహిదాబేగం కుమారుడైన జానీమియా తల్లి ప్రోత్సాహంతో బాల్యంలోనే శాస్త్రీయ నృత్యాన్ని నేర్చుకున్నారు. నృత్యంపట్ల ఆసక్తితో ప్రఖ్యాత నర్తకి శారదారామకృష్ణ వద్ద ఆంధ్ర నాట్యం, హేమంత్‌కుమార్‌ వద్ద భరతనాట్యం నేర్చుకున్నారు. పేరిణి నృత్యంలో విశారద అభ్యసించి ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంపీఏ (భరతనాట్యం) పూర్తి చేశారు. ఈ సమయంలోనే ప్రఖ్యాత నర్తకీ పద్మశ్రీ డాక్టర్‌ ఆనందశంకర్‌ వద్ద శిక్షణ పొంది అనేక జాతీయ నృత్యరూపకాలతో ప్రదర్శనలిచ్చి ప్రతిభ చాటుకున్నారు.