ఆమె ఆహారానికీ పరీక్షలు

ఆమె ఆహారానికీ పరీక్షలు

25-11-2017

ఆమె ఆహారానికీ పరీక్షలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ముప్పు ఏరూపంలోనైనా ముంచుకురావచ్చు. అందుకే అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆమె తినే ఆహారాన్ని కూడా క్షుణ్నంగా పరీక్షించాకనే అనుమతించనున్నారు. ఇందుకోసం అమెరికా నుంచి ప్రత్యేక ఫోరెన్సిక్‌ బృందం హైదరాబాద్‌ రాబోతోంది. ఇందుకు అవసరమైన పరికరాలను తీసుకొస్తున్నారు. అసాంఘిక శక్తులు ప్రముఖులు తీసుకునే ఆహారాన్ని విషపూరితంగా చేయడం ద్వారా తమ లక్ష్యం నెరవేర్చుకునేందుకు ప్రయత్నించవచ్చు. దీని దృష్టిలో ఉంచుకుని వారు తినే ఆహారాన్ని ముందుగా శాస్త్రీయంగా పరీక్షిస్తారు. ఇవాంక విషయంలో ఆమె రక్షణ బాధ్యతలు చూస్తున్న శ్వేతసౌధం సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు ఆహారాన్ని పరీక్షించడానికి అక్కడ నుంచే ప్రత్యేక ఫోరెన్సిక్‌ బృందాన్ని హైదరాబాద్‌ పంపుతున్నారు. దాదాపు 10 మంది నిపుణులుండే ఈ బృందం ఇవాంక పర్యటనకు ఒకరోజు ముందే ఇక్కడకు చేరుకుటుంది.