హైదరాబాద్ కు రానున్న ఇవాంక కార్లు

హైదరాబాద్ కు రానున్న ఇవాంక కార్లు

25-11-2017

హైదరాబాద్ కు రానున్న ఇవాంక కార్లు

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంక ట్రంప్‌ వ్యక్తిగత కార్లు మూడు ప్రత్యేక విమానాల్లో 26 లేదా 27వ తేదీల్లో శంషాబాద్‌ విమానాశ్రయానికి రానున్నాయి. రసాయన దాడులు చేసినా, సుదూర ప్రాంతాల నుంచి స్కడ్‌ క్షిపణులను ప్రయోగించినా తట్టుకునేలా ఈ కార్లను అమెరికా భద్రతా విభాగం ప్రత్యేకంగా తయారు చేసింది. ఇవాంకా ఇక్కడికి వచ్చేముందే కార్లు, అమె రక్షణ సిబ్బంది వస్తున్నారు. శంషాబాద్‌లో ఇవాంక విమానం దిగినప్పటి నుంచి తిరిగి వెళ్లేదాక ఈ సిబ్బందికి అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ఐపీఎస్‌ అధికారిని అందుబాటులో ఉంచారు.