ప్రపంచ తెలుగు మహాసభలకు రాష్ట్రపతి

ప్రపంచ తెలుగు మహాసభలకు రాష్ట్రపతి

25-11-2017

ప్రపంచ తెలుగు మహాసభలకు రాష్ట్రపతి

హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు సమావేశానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి  కేసీఆర్‌ ఆహ్వానం మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ తెలంగాణ ప్రభుత్వానికి అధికారిక సమాచారం పంపింది.  వచ్చే నెల 15న ప్రారంభమయ్యే మహాసభలు 19వరకు సాగుతాయి. 19న జరిగే ముగింపు సమావేశంలో రాష్ట్రపతి పాల్గొంటారు. డిసెంబరు 15న జరిగే తెలుగు మహాసభల ప్రారంభోత్సవాలకు హాజరుకాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే ప్రధాని మోదీని కోరారు.