మహిళలకు పెద్దపీట

మహిళలకు పెద్దపీట

26-11-2017

మహిళలకు పెద్దపీట

2017 ‘మహిళకు అగ్ర తాంబూలం.. అందరికీ సంపద’ నినాదంతో హైదరాబాద్‌లో జరగనున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు దానికి తగ్గట్లుగానే మహిళలకు పెద్దపీట వేస్తోంది. గత సదస్సులతో పోలిస్తే ఈసారి సదస్సుకు ఎక్కువ మంది మహిళలు వస్తున్నారు. దాదాపు 2000 మంది ప్రతినిధుల్లో 52 శాతం మంది వారే! ఇంతమంది మహిళలు గతంలో జరిగిన ఏ జీఈఎస్‌లోను పాల్గొనలేదు. కేవలం ప్రాతినిథ్యం వహించటమే కాదు.. అఫ్గానిస్థాన్‌, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌ వంటి పది దేశాలకు చెందిన బృందాలకు మహిళలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అంతేనా, ఈసారి సదస్సులో యువతుల ప్రాతినిథ్యం కూడా బాగా పెరిగింది.