ప్రశ్నోత్తరాల కార్యక్రమాల మాదిరిగా వర్క్‌ షాపులు

ప్రశ్నోత్తరాల కార్యక్రమాల మాదిరిగా వర్క్‌ షాపులు

26-11-2017

ప్రశ్నోత్తరాల కార్యక్రమాల మాదిరిగా వర్క్‌ షాపులు

జీఈఎస్‌లో ప్రారంభ కార్యక్రమం కాకుండా జరిగే చర్చా కార్యక్రమాలను బ్రేకవుట్‌ సెషన్స్‌, మాస్టర్‌ క్లాస్‌, వర్క్‌ షాపులుగా విభజించారు. బ్రేకవుట్‌ సెషన్స్‌లో నాలుగు ముఖ్యమైన అంశాలపై నిపుణులు, ప్యానలిస్ట్‌లు చర్చిస్తారు. ఇక మాస్టర్‌ క్లాస్‌లలో ఒక ముఖ్యమైన అంశంపై నిపుణులు లోతుగా చర్చిస్తారు. ఇందులో 100 నుంచి 150 మంది దాకా పాల్గొంటారు. వర్క్‌ షాపులు ప్యానలిస్ట్‌ లకు, శ్రోతలకు మధ్య ప్రశ్నోత్తరాల కార్యక్రమాల మాదిరిగా జరుగుతాయి. వీటిలో 40 దాకా పాల్గొంటారు.