ట్రైడెంట్‌ హెటల్‌లో ఇవాంక ట్రంప్‌ బస!

ట్రైడెంట్‌ హెటల్‌లో ఇవాంక ట్రంప్‌ బస!

27-11-2017

ట్రైడెంట్‌ హెటల్‌లో ఇవాంక ట్రంప్‌ బస!

హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌)లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూతురు ఇవాంక ట్రంప్‌ రేపు నగరానికి రానున్నారు. ఇవాంక పర్యటన నేపథ్యంలో నగరంలో భద్రత కట్టుదిట్టం చేశారు. రేపు ఉదయం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ఇవాంక చేరుకుని, అటు నుంచి నేరుగా మాదాపూర్‌లోని ట్రైడెంట్‌ హోటల్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ట్రైడెంట్‌ హోటల్‌తో పాటు వెస్టిన్‌ హోటలో ఇవాంక బస చేసే అవకాశం ఉంది. దీంతో ఈ రెండు హోటళ్లల్లో యూఎస్‌ఐఎస్‌ బలగాలు క్షుణ్ణంగా తనిఖీలు చేశాయి. బలగాలనూ భారీగా మోహరించారు. రేపు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు జరగనుంది.