పారిశ్రామికవేత్తల సదస్సుకు విదేశీ ప్రతినిధుల రాక

పారిశ్రామికవేత్తల సదస్సుకు విదేశీ ప్రతినిధుల రాక

27-11-2017

పారిశ్రామికవేత్తల సదస్సుకు విదేశీ ప్రతినిధుల రాక

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు విదేశీ ప్రతినిధుల రాక మొదలైంది. సోమవారం వివిధ దేశాల పారిశ్రామిక వేత్తలు, ప్రతినిధులు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఉద్యోగులు వీరికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరికీ బొట్టు పెట్టి ఆత్మీయంగా పలకరించారు. మన సంప్రదాయ స్వాగతం విదేశీ ప్రతినిధులకు ఆకట్టుకుంది. కొందరు విదేశీ ప్రతినిధులకు నగరంలోని హోటళ్లలో బస ఏర్పాటు చేయగా.. మరికొందరికి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిధిలోని నోవాటెల్‌ హోటల్‌లో వసతి కల్పించారు.