అతిథి దేవోభవ: ఇవాంకకు ఘన స్వాగతం

అతిథి దేవోభవ: ఇవాంకకు ఘన స్వాగతం

28-11-2017

అతిథి దేవోభవ: ఇవాంకకు ఘన స్వాగతం

హైద్రాబాద్ లో అడుగుపెట్టారు అమెరికా ప్రభుత్వ సలహాదారు ఇవాంక ట్రంప్. తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉన్నతాధికారులు ఇవాంకకు ఘనంగా స్వాగతం పలికారు. మధ్యాహ్నం ప్రధాని మోడీతో కలిసి HICC లో జరగనున్న సదస్సుకు హాజరుకానున్నారు ఇవాంక ట్రంప్.

భారీ భద్రత మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్  కూతురు, సలహాదారు ఇవాంక ట్రంప్  హైదరాబాద్ వచ్చారు. తెల్లవారు జామున 3 గంటలకు శంషాబాద్  ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు ఇవాంక. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పోలీస్ ఉన్నతాధికారులు ఇవాంకకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు.

తర్వాత ప్రత్యేక వాహనంలో హై సెక్యూరిటీ కాన్వాయ్ తో ఇవాంక మాదాపూర్  ట్రైడెంట్  హోటల్ కు చేరుకున్నారు. ఇవాంక రాకతో ఎయిర్ పోర్టుతో పాటు ఆమె వెళ్లనున్న రూట్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎయిర్ పోర్టులో CID IG ఐజీ షికా గోయెల్  భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇవాంకతో పాటు సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన VIP లు , VVIP లకు ఘనంగా స్వాగతం పలికారు అధికారులు. వారిని భారీ భద్రత మధ్య సిటీలోని స్టార్ హోటళ్లకు తీసుకెళ్లారు.

ఇక ట్రైడెంట్ హోటల్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు HICC కి చేరుకుంటారు. తర్వాత HICC లోని సెకండ్ ఫ్లోర్లో భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తో  భేటీ  అవుతారు. మధ్యాహ్నం మియాపూర్లో మెట్రో రైలు ప్రారంభించిన తర్వాత ప్రధాని మోడీ హెలికాప్టర్లో HICC కి చేరుకుంటారు. అక్కడ ప్రధానిని మర్యాదపూర్వకంగా  కలుస్తారు ఇవాంక . తర్వాత ఇద్దరు కలిసి ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సును ప్రారంభింస్తారు. రాత్రి 7.30 కు పాతబస్తీలోని ఫలక్ నుమా ప్యాలెస్ కు వెళ్తారు మోడీ, ఇవాంక. సదస్సుకు వచ్చిన 1500 మంది ప్రతినిధులు 45 బస్సుల్లో ఫలక్ నుమా ప్యాలెస్ కు చేరుకోనున్నారు. అక్కడ అతిధులకు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం.

విందు తర్వాత శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి రాజ్ కోట్ వెళ్లనున్నారు ప్రధాని మోడీ. రాత్రి 10.45 కు తిరిగి మాదాపూర్ ట్రైడెంట్ హోటల్ కు వెళ్తారు ఇవాంక. రేపు మరోసారి HICC సదస్సుకు వెళ్లనున్నారు. లంచ్ తర్వాత మధ్యాహ్నం హోటల్ కు వెళ్తారని తెలుస్తుంది. అక్కడ అమెరికా ప్రతినిధులతో భేటీ అవుతారు. రాత్రి 9.20 కు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి దుబాయ్ బయల్దేరనున్నారు ఇవాంక.

Click here for Photogallery