జీఈఎస్‌ వేదికపై నరేంద్ర మోదీ కీలకోపన్యాసం

జీఈఎస్‌ వేదికపై నరేంద్ర మోదీ కీలకోపన్యాసం

28-11-2017

జీఈఎస్‌ వేదికపై  నరేంద్ర మోదీ కీలకోపన్యాసం

జీఈఎస్‌ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ కీలకోపన్యాసం చేశారు. ఈ సదస్సు సిలికాన్‌ వ్యాలీతో హైదరాబాద్‌ను కలపడమే కాదు భారత్‌ అమెరికా బంధాన్ని బలోపేతం చేస్తుందని చెప్పారు. మహిళలే ప్రథమం అన్న సదస్సు థీమ్‌ వినూత్నమైందన్నారు. అమెరికాతో కలిసి సదస్సును దక్షిణాసియాలో తొలిసారిగా నిర్వహించడం సంతోషకరమన్నారు. భారత పురాణాల ప్రకారం మహిళ ఒక శక్తి.. మహిళలు మనకు స్ఫూర్తి ఇస్తున్నారని కొనియాడారు. మానవజాతి అభివృద్ధి, ఎదుగుదలకు సంబంధించిన అన్ని రంగాలకు సంబంధించి సదస్సులో చర్చలు జరుగుతాయన్నారు. సైనా నెహ్వాల్‌, పీవీ సింధు, సానియా మీర్జాలకు హైదరాబాద్‌ పుట్టిల్లు అని అభివర్ణించారు. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌ వంటి భారత మహిళలు అంతరిక్ష ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించారని ప్రస్తుతించారు. రాణీ అహల్యాబాయి, హోల్కర్‌, రాణి లక్ష్మిభాయి వంటి మహిళలు మనకు స్ఫూర్తినిస్తున్నారని అన్నారు.గుజురాత్‌లో లిజ్జత్‌ పాపడ్ వంటి సంస్థలను మహిళలే ముందుండి నడిపిస్తున్నారు...యోగాకు భారత్‌ మూలమైతే నేడు యావత్‌ ప్రపంచం యోగాను గుర్తిస్తోందన్నారు.

Click here for Event Gallery