తెలంగాణ చిన్నమ్మనే...

తెలంగాణ చిన్నమ్మనే...

29-11-2017

తెలంగాణ చిన్నమ్మనే...

తాను తెలంగాణ చిన్నమ్మనేనని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. హెచ్‌ఐసిసిలో మంగళవారం నాడు ప్రారంభమైన ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో ఆమె మాట్లాడారు. తనకు ఇక్కడి సంస్కృతి చిరపరిచితమేనని అన్నారు. తనను అంతా తెలంగాణ చిన్నమ్మ అని పిలుస్తారని చెప్పారు. సంప్రదాయ, ఆధునీకరణ పరిపూర్ణ మేళవింపు తెలంగాణ అని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్రమోదీ, డోనాల్డ్ ట్రంప్‌ల నేతృత్వంలో ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనడంతో పాటు ఇండియా - యుఎస్ సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకుంటాయని అన్నారు. ఈ ప్రఖ్యాత సదస్సుకు హాజరైనందుకు ఇవాంకకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.